: శాసనమండలి చైర్మన్ గా ఫరూక్ పేరును ప్రకటించిన చంద్రబాబు


శాసనమండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ ఫరూక్ పేరును సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్ లో సెంటర్ ఫర్ లీడర్ షిఫ్ ఎక్స్ లెన్స్ పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. ఈ తరహా విజయాలను అన్ని నియోజకవర్గాలకు వ్యాపింపజేసే నిమిత్తం చంద్రబాబు అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గా ఫరూక్ పేరును ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సహచర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జయాపజయాలు ఎప్పుడూ ప్రభావం చూపిస్తాయని, సాంకేతికతను అనుకూలంగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ పాలనపై ఎనభై శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తే వారి మద్దతు తమకే ఉంటుందని, ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఏమీ ఉండదని అన్నారు.

  • Loading...

More Telugu News