: నంద్యాల, కాకినాడ ఎన్నికల గెలుపుపై నారా లోకేశ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్!
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో టీడీపీ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేశ్ నంద్యాల, కాకినాడ ఎన్నికల విజయంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ విజయాలతో విమర్శకుల నోర్లు మూతపడ్డాయని చెప్పారు. ప్రతిపక్షానికి ప్రజలు ఓటుతో దీటైన సమాధానం చెప్పారని తెలిపారు. ఇదే ఒరవడిని భవిష్యత్తులో కూడా కొనసాగిద్దామని లోకేశ్ పిలుపునిచ్చారు. మరోవైపు, ప్రతి 15 రోజులకు ఒక్కసారి శిక్షణా తరగతులను నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని పార్టీ కార్యాలయం కార్యదర్శి ఏవీ రమణ అన్నారు.