: టీటీవీ దినకరన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!
తమిళనాడు అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయమని టీటీవీ దినకరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు దినకరన్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో దినకరన్ కు షాక్ తగిలినట్టైంది. ఇప్పటికే తనకు మద్దతుగా నిలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి వెనుదిరిగి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం వర్గంలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినకరన్ కు ఈ తీర్పు అశనిపాతమే.