: జైల్లో ఉరి వేసుకున్న గుర్మీత్ బాబా అనుచరుడు


అత్యాచారం కేసులో డేరా స‌చ్చా సౌధా చీఫ్ గుర్మీత్ బాబాను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన‌ నేప‌థ్యంలో హింస‌కు పాల్ప‌డ్డవారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. అందులో గుర్మీత్ బాబా మద్దతుదారు ఒకరు జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని సర్సావాకి చెందిన రవీంద్ర అని పోలీసులు చెప్పారు. అంబాలా జైలులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని వివ‌రించారు. గ‌త‌నెల‌ 25న పంచకులలో జ‌రిగిన విధ్వంసం కేసులో రవీంద్ర జైలులో ఉంటున్నాడ‌ని చెప్పారు. ఆయ‌నను జైలుకి గత నెల 27న త‌ర‌లించిన‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News