: సాధారణ వ్య‌క్తిలా వచ్చి.. గాంధీ ఆసుప‌త్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్


కాలికి ఆనె(కార్న్‌) రావడంతో ఇటీవ‌లే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు గాంధీ ఆసుప‌త్రి వైద్యులు శస్త్రచికిత్స చేయాల‌ని సూచించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సాధారణ వ్య‌క్తిలా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రికి వ‌చ్చిన న‌ర‌సింహ‌న్ ఆ శస్త్ర చికిత్సను చేయించుకున్నారు. న‌ర‌సింహ‌న్‌కు పరీక్షలు నిర్వహించి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆనెను తొలగించామ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఆయ‌న‌ను ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేయ‌నున్నారు. త‌న‌కు ఎప్పుడైనా చికిత్స అవ‌స‌ర‌మైతే తాను గాంధీ ఆసుప‌త్రిలోనే చేయించుకుంటాన‌ని న‌ర‌సింహ‌న్ గతంలో ఓ సారి చెప్పిన విష‌యం తెలిసిందే.  

  • Loading...

More Telugu News