: మోదీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి
క్రీడల శాఖ మంత్రిగా ఒలింపిక్స్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ను నియమించడంపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి సంతోషం వ్యక్తం చేశాడు. ఒక టాప్ స్పోర్ట్స్ పర్సన్ కు క్రీడల శాఖ దక్కడం ఆనందకర విషయమని చెప్పాడు. ఇది మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమని తెలిపాడు.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెండి పథకాన్ని సాధించారు. దశాబ్దకాలంపైగా షూటర్ గా కొనసాగిన ఆయన... ఎన్నో పథకాలను సాధించారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కూడా ఆయన మెడల్స్ సాధించారు. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.