: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య 103వ సినిమా?


ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ జోరు పెంచారు. ప్రస్తుతం 102వ సినిమా చేస్తున్న ఆయన... 103వ సినిమాను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, సీనియర్ డైరెక్టర్ కాకుండా యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. కళ్యాణ్ రామ్ తో 'పటాస్', సాయి ధరమ్ తేజ్ తో 'సుప్రీం హీరో' సినిమాలు చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం రవితేజతో 'రాజా ది గ్రేట్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 తాజాగా బాలయ్యకు ఆయన ఓ కథను వినిపించాడట. దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గుంటూరుకు చెందిన వాసవి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

  • Loading...

More Telugu News