: ఖైరతాబాద్ వినాయకుడి సేవలో ఉప రాష్ట్రపతి


భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు ఖైరతాబాద్ మహా వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటున్నానని చెప్పారు. గణేషుడి దర్శనం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. మన దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని వినాయకుడిని ఈ సందర్భంగా కోరుకున్నానని చెప్పారు. వెంకయ్యతో పాటు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర నేతలు వినాయకుడిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News