: తమ్ముడిపై కత్తులతో దాడి.. అన్న కిడ్నాప్, హత్య!


కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆదోనిలో నాగేంద్ర అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. అన్న నాగేంద్రను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించడాన్ని గుర్తించిన నాగేంద్ర సోదరుడు నరేష్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు అతనిపై కత్తులతో విరుచుకుపడి, విచక్షణా రహితంగా దాడి చేశారు.

దీంతో తీవ్రంగా గాయపడిన నరేష్ తీవ్రరక్తస్రావం కావడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోపక్క, నాగేంద్రను దుండగులు హతమార్చి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనికి కారణం వివాహేతర సంబంధమేనని పోలీసులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News