: ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే రెండు ప్రమాదాలు...!
చైనాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. ఒక ప్రమాదంలో...రద్దీగా ఉండే రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడడంతో వాహనదారులంతా ఆగారు. సిగ్నల్ వెలగడంతో ఆ దారి వాహనాలు వెళ్లేందుకు సిద్ధపడ్డాయి. ఇంతలో ఒక ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు దాటబోయాడు. అంతే.. ఆ దిశగా వెళ్తున్న కారు ఆ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారి గాల్లోకి లేచిన బైకర్.. కారుపై నుంచి రోడ్డు మీద పడి లేచి ఆగ్రహంగా వెళ్లిపోయాడు.
మరో ఘటనలో వేగం నియంత్రించుకోలేని కారు ముందు వెళ్తున్న పెద్ద వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ కారును ముందు వెళ్తున్న పెద్ద వాహనం ఈడ్చేసింది. దీంతో ఆ కారు రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లిపోయింది. అయితే కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి... కారులో వున్న పాపను రోడ్డు మీదకి విసిరేశాడు. దీంతో ఆ పాప నడిరోడ్డుపై పడిపోయింది. ఇంతలో వెనుక వచ్చిన భారీ వాహనం జాగ్రత్తగా పాప పక్కనుంచి వెళ్లగా, ఒక వ్యక్తి పరుగెత్తుకెళ్లి పాపను ఎత్తుకున్నాడు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూడండి.