: రూ. 200 నోటు ఏటీఎంలకు రావడానికి ఇంకా మూడు నెలలు?
ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన రూ. 200 నోట్లు ఏటీఎంలకు రావడానికి ఇంకా మూడు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. రూ. 200 నోట్లను పంపిణీ చేయడానికి ఏటీఎం టెక్నాలజీని అప్‌డేట్ చేయాల్సి ఉంది. దీనికోసం మూడు నెలల కంటే ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఏటీఎం మెషీన్ల అప్‌డేషన్ పనులు ప్రారంభించినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై ఆర్బీఐ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. కాకపోతే మార్కెట్లోకి పెద్ద మొత్తంలో రూ. 200 నోట్లను విడుదల చేసేందుకు ఆర్బీఐ యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ. 200 నోటు ఆర్బీఐ శాఖలతో మరికొన్ని ఇతర బ్యాంకుల్లో మాత్రమే లభిస్తోంది.