: యువహీరోని ఆకాశానికెత్తేస్తున్న నయనతార!


కోలీవుడ్ యువ హీరో శివకార్తికేయన్ ను నయనతార ఆకాశానికెత్తేస్తోంది. ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో నయనతార అతని గురించి మాట్లాడుతూ, శివ చాలా సరదా వ్యక్తి అని చెప్పింది. షూటింగ్‌ స్పాట్‌ లో ఆయన ఉంటే సందడికి ఏ మాత్రం కొదవ ఉండదని తెలిపింది. ఆయన ఉంటే పనిభారం, ఒత్తిడి అస్సలు తెలీదని తెలిపింది. ఒక వైపు నటిస్తూనే సెట్ లో పని చేసే వారిని నవ్విస్తుంటాడని చెప్పింది. ఆయన అలా చేయడం వల్ల పని చేసేవారికి పని భారం తెలియదని చెప్పింది. ఇలాంటి ప్రత్యేకత శివకార్తికేయన్ కు మాత్రమే ఉందని నయనతార అభినందిస్తోంది.

ప్రస్తుతం వీరిద్దరూ కలసి 'వేలైక్కారన్' చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత మరో సినిమాలో కూడా వీరు కలిసి నటించేందుకు సిద్ధమైనట్టు కోలీవుడ్ చెప్పుకుంటోంది. అన్నట్టు, శివకార్తికేయన్ కూడా తన స్నేహితుల వద్ద నయనతార దండకం చదువుతున్నాడట!

  • Loading...

More Telugu News