: పాపం ఫ్లింటాఫ్!.. పాప్ సింగర్‌ వేషధారణలో వచ్చి మైదానంలో పడిపోయిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్!


ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్ ఫైనల్‌లో సరికొత్త అవతారంతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఆ వెంటనే కిందపడి ‘అమ్మా’ అన్నాడు. ప్రేక్షకులు ఫక్కుమన్నారు. అమెరికా పాప్ ఐకాన్ ఎల్విస్ ప్రెస్లీ లా డ్రెస్ వేసుకొచ్చిన ఫ్లింటాఫ్ మ్యాచ్ జరుగుతుండగా బౌండరీ లైన్ వద్ద వెనక్కి నడుస్తూ కామెంటరీ చెప్పడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో వెనక స్పీకర్ ఉన్న విషయాన్ని గుర్తించని ఫ్లింటాప్ దానికి తగిలి ఒక్కసారిగా కిందపడ్డాడు. అయితే ఆ వెంటనే ఏమీ జరగనట్టు లేచి నిల్చుని తిరిగి కామెంటరీ చెప్పడం ప్రారంభించాడు. ఫ్లింటాఫ్ వేషధారణ చూసి కేరింతలు కొడుతున్న ప్రేక్షకులు ఆయన కిందపడగానే నవ్వకుండా ఉండలేకపోయారు. ఇక ఫ్లింటాఫ్ సహచర కామెంటేటర్ డేవిడ్ లాయడ్ అమెరికన్ సింగర్ జానీ క్యాష్‌లా డ్రెస్ చేసుకొచ్చాడు.

  • Loading...

More Telugu News