: అర్ధరాత్రి సిలెండర్ పేలుడు... ఇద్దరి మృతి.. ఆందోళనతో పరుగులు తీసిన స్థానికులు!


యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో గత రాత్రి సిలెండర్ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొంత మంది ఇళ్లలోంచి పరుగులు తీశారు. సిలెండర్ పేలుడు ధాటికి పక్కపక్క ఇళ్లలో నివసించే వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సజీవ దహనమయ్యారు. గాలమ్మ అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆమె మనవడు గాంధీ ఆసుపత్రికి తరలించాడు. వరుస సెలవులు కావడంతో వారి భార్య, పిల్లలు ఊరికి వెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది. 

  • Loading...

More Telugu News