: ఉత్తరకొరియా రోగ్ నేషన్...దాని మాటలు, చేతలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి: ట్రంప్
ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించనుందని, ఈ మేరకు బాంబును తయారు చేశామని, దీనిని తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా రోగ్ నేషన్ (వంచక దేశం) అని అన్నారు. ఆ దేశం చేసే ప్రకటనలు, చేష్టలు అమెరికాకు వ్యతిరేకంగా, ప్రమాదకరంగా మారాయని ఆయన ట్విట్టర్ లో ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు సాయం చేద్దామనుకున్న చైనాకు కూడా ఉత్తరకొరియా చివరకు ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. ఉత్తరకొరియాను బుజ్జగించేందుకు చేపట్టిన చర్చలు ఫలించవన్న విషయాన్ని దక్షిణ కొరియా అర్థం చేసుకుందని ఆయన అన్నారు.