: మోదీ, అమిత్ షాలను అంచనా వేయలేం!: ఒమర్ అబ్దుల్లా


ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాల వ్యూహాలను అంచనా వేయడం కష్టమని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ను ఎంపిక చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొత్త రక్షణ మంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. డోక్లాం సమస్యలో ప్రధాని మోదీ అనుసరించిన విధానాన్ని కీర్తించిన ఆయన, రెండు రోజులు తిరక్కముందే మరోసారి మోదీని ఆయన ఆకాశానికి ఎత్తారు. 

  • Loading...

More Telugu News