: నాకు గన్ మెన్, జీరో ట్రాఫిక్ సౌకర్యాలు వద్దు... ప్రజల్లోనే ఉంటాను: కర్ణాటక హోం మంత్రి


రాష్ట్ర మంత్రులంటే మందీ మార్బలం, జీరో ట్రాఫిక్, గన్ మెన్లు, పటిష్ఠభద్రత ఇలాంటి సౌకర్యాలు సర్వ సాధారణం. అయితే కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి మాత్రం తనకు గన్ మెన్ కూడా అవసరం లేదని తెలిపారు. తాను సాధారణమైన రాజకీయ నాయకుడినని అన్నారు. ప్రత్యేక భద్రత, కాన్వాయ్, జీరో ట్రాఫిక్ వంటి సౌకర్యాలు అవసరం లేదని చెప్పారు. తనకు ప్రజల మనిషిగా ప్రజల్లో ఉండడం ఇష్టమని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో మంత్రి పదవులు పొందానని ఆయన చెప్పారు. తనకు భద్రత అవసరం లేదని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News