: కేంద్ర కేబినెట్‌లో జేడీయూకు దక్కని చోటు.. లాలు సెటైర్!
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీజేపీ కొత్త మిత్రుడు జేడీయూకు చోటు లభించకపోవడంపై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సెటైర్ వేశారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కొందరు జేడీయూ నేతలు కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారని, కానీ వారి ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తిత్వం గురించి ప్రధాని మోదీకి, అమిత్ షాకు చాలా బాగా తెలుసని, ఈ కారణంగా జేడీయూను మంత్రివర్గంలోకి తీసుకోలేదని విమర్శించారు. పునర్వ్యవస్థీకరణ గురించి ప్రధాని మోదీ తమతో ఒక్క మాటైనా చెప్పలేదని నితీశ్ కుమార్ తెగ బాధపడిపోతున్నారని లాలు అన్నారు. కాగా, కొత్త మిత్రులైన జేడీయూ, అన్నాడీఎంకేలకు కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని తొలి నుంచి వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు సమాచారం.