: తల్లి కిందపడిపోవడంతో కన్నీరు పెట్టుకున్న వంగవీటి రాధ!


విజయవాడలోని వైసీపీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత వంగవీటి రాధ, రంగాలపై వైసీపీ నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేత రాధా, ఆయన తల్లి రత్నకుమారి ప్రెస్ మీట్ పెట్టేందుకు తమ నివాసం నుంచి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే, రాధా నివాసం వద్దకు అభిమానులు చేరుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రాధ, రత్నకుమారి కిందపడిపోయారు. రాధా వేసుకున్న చొక్కా చిరిగిపోయింది. తన తల్లి కిందపడిపోవడంతో రాధా కన్నీరు పెట్టుకున్నారు. కాగా, రాధాను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News