: వన్డేల్లో ధోనీ రికార్డు.. కీపర్ గా 100 స్టంపింగ్స్ ఘనత!


వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన రికార్డును టీమిండియా కీపర్ ధోనీ సొంతం చేసుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డేలో ఈ రికార్డును ధోనీ సాధించాడు. మొత్తం 301 వన్డేల్లో 100 స్టంపింగ్స్ చేసిన కీపర్ గా ధోనీ రికార్డుల కెక్కాడు. ఈ వన్డేలో 44.6వ ఓవర్ లో చాహల్ వేసిన బంతిని కొట్టబోయిన శ్రీలంక క్రికెటర్ ధనుంజయను ధోనీ స్టంపింగ్ చేశాడు. కాగా, ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. 239 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగనుంది.

  • Loading...

More Telugu News