: ‘పవర్ స్టార్’ కొత్త చిత్రం స్టిల్.. సెట్స్ లో పవన్ కల్యాణ్ - కీర్తి సురేష్!


పవన్ కల్యాణ్- కీర్తి సురేశ్ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో ఘాటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ సన్నివేశంలో పవన్, కీర్తి సురేష్ కలిసి ఉన్న ఓ ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర నిర్మాత రాధాకృష్ణ ఈ ఫొటోను విడుదల చేశారు.

కాగా, ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్, రొమాన్స్, సెంటిమెంట్, కామెడీతో పాటు యాక్షన్ సీన్లు ఉండనున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News