: హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం
హైదరాబాద్ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకి ఘనస్వాగతం లభించింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ సంస్థ 78వ సమావేశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్పీ సింగ్ స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి రోడ్డుమార్గం ద్వారా శామీర్ పేటలోని నల్సార్ వర్సిటీకి ఆయన బయలుదేరి వెళ్లారు.