: ‘బాహుబలి 2’ చూడాలనిపించలేదు.. అవకాశమొచ్చినా అలాంటి సినిమాల్లో నటించను: బాలీవుడ్ నటి సయానీ


‘బాహుబలి 2’ సినిమా విడుదలై సుమారు ఆరు నెలలు కావస్తున్న తరుణంలో బాలీవుడ్ నటి సయానీ గుప్తా ఈ చిత్రం గురించి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది. ‘బాహుబలి 2’ ట్రైలర్ చూశాక, ఈ సినిమా చూడాలని తనకు అనిపించలేదని, ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం తనకు వచ్చినా కూడా నటించనని చెప్పింది.

‘బాహుబలి’ని హాలీవుడ్ చిత్రాలతో పోల్చలేమని, అదో భారీ చిత్రం మాత్రమేనని చెప్పుకొచ్చింది. ‘బజరంగీభాయ్ జాన్’ లాంటి సినిమాల్లో నటించాలని తనకు ఉందని, ఆ చిత్రం చాలా బాగుంటుందని సయానీ గుప్తా చెప్పుకొచ్చింది. కాగా, బాలీవుడ్ మూవీ 'హంగ్రీ' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన సయానీ నటిస్తోంది

  • Loading...

More Telugu News