: హాఫ్ సెంచరీ మిస్సయిన తరంగ... మూడో వికెట్ కోల్పోయిన లంక!
శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి తరంగ (48) ఔటయ్యాడు. మరో రెండు పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తి చేసే క్రమంలో తరంగ ఔట్ కావడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. అంతకుముందు, 6.2 ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని కొట్టిన మునావీరా (4), కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. కాగా, ఇప్పటివరకు భువనేశ్వర్ రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్ లో తిరిమన్నె, మ్యాథ్యూస్ కొనసాగుతున్నారు.13.2 ఓవర్లలో శ్రీలంక జట్టు స్కోర్: 74/3