: చివరి వన్డేకు ఆటంకం కలిగిస్తున్న చిరుజల్లులు!
కొలంబో వేదికగా శ్రీలంక-భారత జట్ల మధ్య జరగనున్న చివర వన్డే మ్యాచ్ ఆలస్యంగా జరగనుంది. చిరుజల్లుల కారణంగా మ్యాచ్ ఆలస్యం కానుంది. ఈ జల్లులు ఆగినట్టే ఆగి మళ్లీ మొదలవడంతో పిచ్ తడవకుండా ఉండేందుకు దానిపై కవర్ వేశారు. దీంతో, మ్యాచ్ ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఇంకా టాస్ కూడా వేయలేదు. కాగా, శ్రీలంక జట్టు వార్మప్ చేస్తుండగా, కోహ్లీ సేన ముచ్చట్లు పెడుతోంది.