: ప్రమోషన్ పొందిన కేంద్ర మంత్రుల శాఖలివే!


కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ పొందిన నలుగురు మంత్రులపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. నిర్మలా సీతారామన్‌ కు కీలకమైన రక్షణ శాఖను అప్పగించినట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తరువాత రక్షణ మంత్రిగా నియమితురాలైన తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కనున్నారు.

పీయూష్‌ గోయల్‌ కు రైల్వే శాఖ, ధర్మేంద్ర ప్రదాన్‌ కు పెట్రోలియం శాఖ, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి మైనార్టీ సంక్షేమ శాఖలను అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభుకు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ, నితిన్‌ గడ్కరీకి జలవనరుల శాఖను అప్పగించనున్నట్టు సమాచారం. కొత్తగా కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టిన హర్దీప్‌ సింగ్‌ కు వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News