: చైనా బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ!


మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి కాగానే ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు బయల్దేరారు. చైనా నేతృత్వంలో క్సియమెన్ లో ఈ నెల 3 నుంచి 5 వరకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన బయల్దేరారు. 4న బ్రిక్స్ సమావేశంలో సహకారం, సమస్యలు, పరిష్కారాలు, భవిష్యత్ చర్యలపై చర్చలు చేపడతారు.

5న తిరుగు ప్రయాణంలో మూడు రోజుల పర్యటనకు మయన్మార్‌ వెళ్లనున్నారు. మయన్మార్‌ దేశాధ్యక్షుడు యు హ్తిన్‌ క్యావ్‌, స్టేట్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌ సాన్‌ సూచీతో కలిసి మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.  

  • Loading...

More Telugu News