: మెగాస్టార్ విడుదల చేయనున్న 'ఇంద్ర సేన' ఫస్ట్ లుక్!
'బిచ్చగాడు' సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో 'ఇంద్రసేన' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో కూడా వీరు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. వర్థమాన నటులను ప్రోత్సహించడంలో ముందుండే చిరంజీవి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు.
సి.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గతంలో చిరంజీవితో పలు సినిమాల్లో నటించిన ఆయన మిత్రురాలు రాధిక శరత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. విజయ్ ఆంటోనీ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.