: మోదీ కేబినెట్ లో 9 మంది కొత్త మంత్రులు...నలుగురికి ప్రమోషన్!
ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఇందులో నలుగురికి ప్రమోషన్ ఇవ్వగా, 9 కొత్త ముఖాలను కేబినెట్ లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇందులో కేబినెట్ హోదాను నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ కు కల్పించారు. సహాయ మంత్రులుగా శివ్ ప్రతాప్ శుక్లా, అశ్వినీ కుమార్ చౌబే, డాక్టర్ వీరేంద్ర కుమార్, అనంత్ కుమార్ హెగ్డే, సత్యపాల్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, అల్పాన్స్ కన్వంధనమ్, హర్దీప్ సింగ్ పూరీ, రాజ్ కుమార్ సింగ్ లకు కేబినెట్ లో స్థానం కల్పించారు.