: నేటి మ్యాచ్ కు ధావన్ దూరం.. రహానేకి ఛాన్స్!
నేటి మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడడం లేదు. దీనికి కారణం, ధావన్ తల్లి అనారోగ్యంతో ఉండడమే. ఈ వార్త తెలియడంతో అతను హుటాహుటీన ఇండియాకి వచ్చేశాడు. దీంతో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న అజింక్యా రహానేకు జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. నాలుగో వన్డేలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ధావన్ దూరం కావడంతో నేటి మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ను రోహిత్ తో కలిసి రాహుల్ ఆరంభించనున్నాడు. మిడిల్ ఆర్డర్ లో రహానే బ్యాటింగ్ కు రావచ్చు.