: 15 ఏళ్ల తర్వాత రంగంలోకి దిగుతున్న విశ్వనాథన్ ఆనంద్.. ఫిడే వరల్డ్ కప్‌కు సన్నద్ధం.. నేడు తొలి మ్యాచ్!
ఐదుసార్లు ప్రపంచ కప్ విజేత అయిన విశ్వనాథన్ ఆనంద్ 15 ఏళ్ల తర్వాత మరోమారు రంగంలోకి దిగుతున్నాడు. జార్జియాలో జరగనున్న 128-ప్లేయర్ నాకౌట్ టోర్నమెంట్లో ఏడుగురు సభ్యుల బృందానికి ఆనంద్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. నేడు (ఆదివారం) జరగనున్న ఓపెనింగ్ రౌండ్లో 18 ఏళ్ల మలేషియా ఆటగాడు లి తియన్ ఎవోతో ఆనంద్ తలపడనున్నాడు. 2000లో చైనాలో, 2002లో హైదరాబాదులో జరిగిన ప్రపంచకప్‌లో విజయాలు సాధించిన తర్వాత ఆనంద్‌కు వరల్డ్‌కప్‌లు ఆడే అవసరం రాలేదు. ఈ టోర్నీలో విజయం సాధించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బెర్త్ ఖరారు చేసుకోవాలని 47 ఏళ్ల ఈ వెటరన్ భావిస్తున్నాడు.