: రైలు ప్రమాదాల నివారణకు ఇలా చేయండి.. భారతీయ రైల్వేకు ప్రపంచ బ్యాంకు సూచనలు!
ఇటీవల దేశంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరగడంతో స్పందించిన ప్రపంచ బ్యాంకు.. ప్రమాదాల నివారణకు కొన్ని సూచనలు చేసింది. రైలుకు లేత పసుపు పచ్చ రంగు వేయడం ద్వారా చీకటిలోనూ రైలు కనిపిస్తుందని, అలాగే రైలుకు ‘డిచ్ లైట్లు’ ఏర్పాటు చేయాలని సూచించింది. రైల్వే సిబ్బంది ‘హై విజిబులిటీ’ దుస్తులు ధరించాలని, ప్రతి రైలులోను అగ్ని ప్రమాద నిరోధక సాధనాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
అలాగే సిబ్బందికి వాటిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వాలని తెలిపింది. రైల్వే బోర్డు చైర్మన్ ఆధ్వర్వంలో సేఫ్టీ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైల్వేను మరింత బలోపేతం చేయాలని సూచించింది. ప్రమాదాలు జరిగినప్పుడు త్వరితగతిన అక్కడికి చేరుకునేలా ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ఇటువంటి చిన్నచిన్న పద్ధతులు చేపట్టడం ద్వారా పెను ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని వివరించింది.