: ఈ నెల 21 నుంచే జియో ఫోన్ల డెలివరీ.. వెల్లడించిన జియో వర్గాలు!


జియో 4జీ ఫీచర్ ఫోన్లను బుక్ చేసుకున్న వారికి ఈ నెల 21 నుంచి డెలివరీ చేయనున్నట్టు జియో వర్గాలు తెలిపాయి. 60 లక్షల యూనిట్లు బుక్ అవగా వారందరికీ దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే 21వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నాయి. ఆగస్టు 24న ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 60 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఈ ఫోన్ ఉచితమే అయినప్పటికీ సెక్యూరిటీ డిపాజిట్ కింద సంస్థ రూ.1500 వసూలు చేస్తోంది. బుకింగ్ సమయంలో రూ.500 కట్టించుకోగా, డెలివరీ అనంతరం మిగతా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సొమ్మును మూడేళ్ల తర్వాత జియో తిరిగి వినియోగదారుడికి చెల్లించనుంది.

  • Loading...

More Telugu News