: అణ్వాయుధ రైలు తయారీ చేస్తోన్న రష్యా.. శత్రువులను మట్టికరిపించేలా ఎన్నో ప్రత్యేకతలు!


ర‌ష్యా త‌న అణ్వాయుధ‌ శ‌క్తిని మ‌రింత పెంచుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. అణు క్షిపణులను భూమి, వాయు జలమార్గంలో ప్రయోగించే శ‌క్తిని ఇప్ప‌టికే ఎన్నో దేశాలు క‌లిగి ఉన్నాయి. అయితే, ర‌ష్యా రైళ్లను కూడా ఇందుకోసం వాడుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రష్యా న్యూక్లియర్‌ క్షిపణుల రైలును పరీక్షిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన మీడియా తెలిపింది. ప్ర‌స్తుతం త‌మ దేశం 2020 నాటికి రైల్‌రోడ్‌ మిసైల్‌ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని ధ్యేయంగా పెట్టుకుంద‌ని పేర్కొంది. బార్గుజిన్‌ రైల్‌రోడ్‌ ఆయుధ ఫ్యాక్ట‌రీలో ఈ రైలు నిర్మాణాన్ని ఎంతో ర‌హ‌స్యంగా చేప‌డుతున్నారు. ఈ అణ్వాయుధ రైలు ప్ర‌యోగ ప‌రీక్ష‌ను 2019లో నిర్వహిస్తారు.

ఈ రైలు ప్రత్యేక‌త‌లు...
  • దీని నుంచి ఒక్కోటి 55 టన్నుల బరువు ఉండే ఆరు ఆర్‌ఎస్‌24యార్‌ ఖండాంతర క్షిపణులను ప్ర‌యోగించ‌వ‌చ్చు
  • ఒక్కో క్షిపణిలో 10 న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉంటాయి
  • ఒక్క రైలులో ఉండే మొత్తం అణ్వాయుధాలు 60
  • అణుక్షిపణులను ఎక్కడ నుంచి ఎప్పుడు ప్రయోగించాలో నిర్ణయించగానే ఈ అణ్వాయుధ‌ రైళ్లు అక్కడకు చేరుకుంటాయి
  • రైలుపైనుంచే నేరుగా ప్రయోగించవచ్చు
  • వీటి గమనాన్ని శత్రువులు ప‌సిగ‌ట్ట‌కుండా ఏర్పాటు

  • Loading...

More Telugu News