: కొన్ని భావోద్వేగాలకి వివరణ అవసరం లేదంటూ.. తండ్రితో దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన హీరో కల్యాణ్ రామ్!


సినీన‌టుడు, మాజీ ఎంపీ నంద‌మూరి హ‌రికృష్ణ ఈ రోజు పుట్టినరోజు వేడుక జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా 'పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు నాన్న' అంటూ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా హ‌రికృష్ణ‌తో తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసి, కొన్ని భావోద్వేగాల‌కు వివ‌ర‌ణ అవ‌స‌రం లేదని పేర్కొన్నాడు. అందులో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ భుజంపై హ‌రికృష్ణ ప్రేమతో త‌న త‌ల వాల్చారు. ఈ ఫొటో నంద‌మూరి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.. 'నాన్నకు ప్రేమతో' అని టైటిల్ పెడుతున్నారు.. మీరూ చూడండి...!

  • Loading...

More Telugu News