: సినీనటుడు నారాయణమూర్తికి తూర్పు గోదావరిలో చేదు అనుభవం.. షూటింగును అడ్డుకున్న స్థానికులు!
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రం పాలెంలోని పుష్కర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద సినీనటుడు ఆర్.నారాయణమూర్తి ‘అన్నదాతా సుఖీభవ’ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా స్థానికుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. తమ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి లేదని స్థానిక నాయకులు సినిమా యూనిట్‌ని అడ్డుకున్నారు.
దీంతో నారాయణమూర్తికి, అక్కడి స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తోన్న మీడియాపై కూడా నారాయణమూర్తి మండిపడ్డారు. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం నారాయణమూర్తితో పాటు సినిమా యూనిట్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఎవ్వరిపైనా కేసు నమోదు చేయలేదు.