: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన నితీశ్ కుమార్.. కీలక వ్యాఖ్యలు!
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇటీవలే ఎన్డీఏలో చేరిన జేడీయూకి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఊహాగానాలు వస్తోన్న విషయం తెలిపిందే. దీనిపై జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ అధిష్ఠానం నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని, ఈ విషయం గురించి తాము కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని చెప్పారు.
జేడీయూకి చెందిన కనీసం ఒక్కరికైనా తప్పకుండా కేంద్ర మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు భావిస్తోన్న నేపథ్యంలో నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొత్త మంత్రులుగా రేపు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంశంపై పీఎంవో నుంచి ప్రకటన రావాల్సి ఉంది.