: సైనికులు, సీనియర్‌ సిటిజన్స్‌, విద్యార్థులకు ఎయిర్ ఇండియా 50 శాతం డిస్కౌంట్‌!


దేశీయ విమానాల్లో ఎకనామీ తరగతి టికెట్లపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్‌ను సైనికులు, సీనియర్‌ సిటిజన్స్‌, విద్యార్థులకు అందిస్తున్న‌ట్లు తెలిపింది. డిస్కౌంట్‌లో ఈ టికెట్ల‌ను పొందేందుకు ప్ర‌యాణికులు త‌మ ప్రయాణానికి ఏడు రోజుల ముందుగానే బుక్‌ చేసుకోవాల‌ని వివ‌రించింది. అయితే, ఈ ఆఫ‌ర్ ఎప్పుడు ముగుస్తుంద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఈ ప్ర‌క‌ట‌న‌ను ఎయిర్ ఇండియా త‌న అధికారిక‌ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ టికెట్లు పొందాల‌నుకుంటే ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్ లేక‌ కార్యాలయాలను సంప్ర‌దించ‌వ‌చ్చు.

  • Loading...

More Telugu News