: మోదీ మంత్రివర్గంలో తెలంగాణ నుంచి వెదిరె శ్రీరామ్?
మూడో సారి కేంద్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం జరగనున్న ఈ మంత్రివర్గ విస్తరణ గురించి దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు, వార్తా ఛానళ్ల ప్రతినిధులు అంచనాలు వేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విస్తరణకు వీలుగా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వెదిరె శ్రీరామ్ భువనగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కంభంపాటి హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎవరికి ఏ పదవులు దక్కుతాయో.. కొత్తగా ఎవరు కేబినెట్‌లోకి వస్తారో... స్పష్టంగా తెలియాలంటే ఆదివారం ఉదయం 10 గంటల వరకు వేచిచూడాల్సిందే.