: మసాజ్ చేయించుకోవాలి.. ఆమెను నాతోనే ఉంచండి: డేరా బాబా
డేరా సచ్చా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచారం కేసుల్లో జైలు ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తన దత్త పుత్రిక హనీప్రీత్ ను కూడా తనతో పాటే జైల్లో ఉంచాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టుకు మొరపెట్టుకున్నాడు. హనీ తన వ్యక్తిగత ఫిజియో థెరపిస్టు అని... తనకు మసాజ్ చేసేందుకు ఆమెను తనతో పాటే జైల్లో ఉంచాలని ఆయన కోరాడు. అయితే డేరాబాబా అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది. కాగా, డేరాబాబాను జైలు నుంచి విడిపించేందుకు హనీప్రీత్ కుట్రలు పన్నినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. మరోవైపు, డేరాబాబాకు హనీప్రీత్ దత్తపుత్రిక కాదని... వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందంటూ ఆమె మాజీ భర్త ఆరోపించిన సంగతి తెలిసిందే.