: జూకు రూ.140 కోట్ల విరాళం ఇచ్చిన వృద్ధురాలు.. ఆ ప్రాంతం అంటే అంత ఇష్టం మరి!
ఓ వృద్ధురాలు జూకు 140 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన సంఘటన అమెరికాలోని కొలిన్‌లో చోటుచేసుకుంది. తనకు ఆ జూ అంటే ఎంతో ఇష్టమని సదరు వృద్ధురాలు ఎలిజబెత్ రీచర్ట్ (96) తెలిపింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తాను ఈ జూ ఉన్న ప్రాంతంలోనే తన భర్తను కలుసుకున్నానని చెప్పింది. తన భర్త పేరు అర్నల్ఫ్ రీచర్ట్ అని, ఆయనతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి జరిగిందని తెలిపింది.
ఆ తరువాత తాము పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడి, మిలియన్ల డాలర్లు సంపాదించామని చెప్పింది. తమకు సంతానం లేదని, తమ మరణానంతరం తమ సంపదను జూకు డొనేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అర్నల్ఫ్ రీచర్ట్ పేరుమీదున్న ఫౌండేషన్ ద్వారా ఆ డబ్బును ఖర్చు చేయనున్నారు.