: టీఆర్ఎస్ లో సొంతంగా గెలుపొందే లీడర్ ఒక్కడూ లేడు!: మల్లు భట్టి విక్రమార్క!


టీఆర్ఎస్ పార్టీని 'టెంపరరీ పొలిటికల్ పార్టీ'గా అభివర్ణించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. కేవలం కేసీఆర్ ఇమేజ్ మీదే టీఆర్ఎస్ నడుస్తోందని... సొంతంగా గెలుపొందే ఒక్క లీడర్ కూడా ఆ పార్టీలో లేడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అయితే సొంతంగా గెలిచే నేతలు ఎంతో మంది ఉన్నారని చెప్పారు. 2014తో పోల్చుకుంటే కేసీఆర్ ఫేస్ వాల్యూ కూడా తగ్గిపోయిందని, ఇదే సమయంలో కాంగ్రెస్ బాగా పుంజుకుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో 75 స్థానాలను కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ కే నష్టమని... టీఆర్ఎస్ ఓట్లు చీలితే కాంగ్రెస్ కే లాభిస్తుందని అన్నారు. 

  • Loading...

More Telugu News