: గణేశ్ నిమజ్జనం, బక్రీద్‌లపై బాలీవుడ్ భామ కాజోల్ ట్వీట్... లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించిన ముస్లిం నెటిజన్
అభిమానులకు గణేశ్ ఉత్సవ్, బక్రీద్ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ నటి కాజోల్ ఓ ట్వీట్ చేశారు. రెండు పండుగలను కలిపి ఒకేసారి విషెస్ చెబుతూ ఆమె ఓ వాక్యం రాశారు. `గణపతి, ఈద్ పండుగలను దేవుళ్లే కలసి ఒకరోజు జరుపుకుంటున్నారు. మరి మనమెందుకు జరుపుకోకూడదు? అందరికీ శుభాకాంక్షలు` అంటూ ఆమె ట్వీట్ చేశారు.
దీనిపై ఓ ముస్లిం నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. `ఇదే మీకు నా చివరి హెచ్చరిక, లేదంటే జరగబోయే వివాదానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది` అని కామెంట్ చేశాడు. కాజోల్‌కు మద్దతునిస్తూ కొంతమంది నెటిజన్లు ఆ ముస్లిం నెటిజన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇంకా కాజోల్ చేసిన ట్వీట్ చాలా బాగుందని, ఆలోచింపజేసేదిగా ఉందని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.