: ధనుష్ చేతికి 'అర్జున్ రెడ్డి' తమిళ హక్కులు!


టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. దీంతో, ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ హీరో ధనుష్ కు చెందిన నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అయితే, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ను ధనుష్ చేస్తాడా? లేక మరెవరైనా పోషిస్తారా? అనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మిలియన్ మార్క్ ను దాటేసింది. మరోవైపు, ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళిలాంటి వారు ప్రశంసలు కురిపించారు. 

  • Loading...

More Telugu News