: మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా 12 మంది?.. కాసేపట్లో అధికారిక ప్రకటన
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం కసరత్తు కొనసాగుతోంది. మోదీ మంత్రివర్గంలోకి తీసుకునే కొత్త మంత్రుల వివరాలను ఈ రోజు పీఎంవో ప్రకటించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. మరో ఐదుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉంది. మోదీ మంత్రివర్గంలో కొత్తగా మొత్తం 12 మంది నేతలను తీసుకోనున్నారు. మోదీ మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరు చేరతారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం 10 గంటలకు ఆయా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.