: హైదరాబాద్ శివారులో వేగంగా వెళ్తూ బైక్ ను ఢీ కొన్న టిప్పర్.. ఇద్దరి మృతి
హైదరాబాద్ శివారులోని ఉప్పల్ డిపో సమీపంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి జాతీయ రహదారిపై ఓ బైక్‌ను టిప్పర్ ఢీ కొట్టడంతో బైక్ పై వెళుతోన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణం టిప్పర్ అతి వేగంగా రావడమేనని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.