: చైనాకు షాకిచ్చేలా సంకేతాలను పంపిన భారత్


ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చైనాలో బ్రిక్స్ దేశాల సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమావేశాల్లో ఉద్రవాద సమస్య, ఉగ్రవాదులకు పాకిస్థాన్ సహకారం తదితర అంశాలను భారత్ లేవనెత్తుతుందని చైనా కలవరపడుతోంది. దీంతో, పాకిస్థాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడరాదంటూ భారత్ కు చైనా సంకేతాలను పంపింది. ఈ సంకేతాల పట్ల భారత్ అదే స్థాయిలో స్పందించింది. ఈ నెల 4వ తేదీన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలు చర్యకు వచ్చే సందర్భంలో... పాకిస్థాన్ గురించి మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News