: టీడీపీ గెలుపుతో కాపు ఉద్యమం ఆగదు: ముద్రగడ పద్మనాభం


కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధించినంత మాత్రాన కాపు ఉద్యమం ఆగదని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు ఉద్యమ ప్రభావం లేదని సీఎం చంద్రబాబు అనడం అవివేకమని విమర్శించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తాను ప్రచారం చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాగా, కాపు రిజర్వేషన్ల అంశంపై డిసెంబర్ 6 లోగా తేల్చకపోతే తమను ఎవరూ ఆపలేరని, తమ సత్తా చూపిస్తామంటూ ముద్రగడ ఇటీవల హెచ్చరించారు. ఇటీవల ముద్రగడ తన పాదయాత్రను వాయిదా వేసుకున్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News