: విజయమ్మ, షర్మిల.. మహిళలకు స్ఫూర్తిదాయకులు వీరే: రోజా
భర్త మరణించినా, కొడుకును జైల్లో ఉంచినా స్థైర్యం వీడని విజయమ్మ.. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వేల కిలోమీటర్లు నడక సాగిస్తోన్న షర్మిల.. మహిళలకు స్ఫూర్తిదాయకులని వైఎస్సార్సీపీ మహిళానేత రోజా వ్యాఖ్యానించారు. ప్రజలకు అండగా నిలుస్తోన్న విజయమ్మకు పాదాభివందనం చేయాలని, సామాన్యులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోన్న షర్మిలకు చేతులెత్తి నమస్కరించాలని రోజా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా బాపట్లలో నేడు జరిగిన 'మహిళా నగారా' సభలో రోజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో మహిళలకు భద్రత లోపించిందని తెలిపారు. బెల్టు షాపులు ఎక్కువవడంతో మద్యం మత్తులో రక్తసంబంధీకులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారని రోజా ఆందోళన వ్యక్తం చేశారు.