: గుర్మీత్ బాబా వర్క్ పర్మిట్ రద్దు చేసిన సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన కారణంగా అతని వర్క్ పర్మిట్‌ను రద్దు చేస్తున్నట్లు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. విచారణ తేదీకి పది రోజుల ముందే `ఎంఎస్‌జీ` సిరీస్‌లో తన తదుపరి చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను గుర్మీత్ బాబా విడుదల చేశాడు. దీని పేరు `ఎంఎస్‌జీ ఆన్‌లైన్ గురుకుల్`. అంతేకాకుండా 2017 ప్రారంభంలో తన దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్‌తో కలిసి `జట్టు ఇంజినీర్` అనే సినిమా కూడా విడుదల చేశాడు.
తన అనుచరులను మద్యపానం, మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు బాబా గుర్మీత్ సినిమాల ద్వారా ప్రచారం చేసేవాడని కొంతమంది చెబుతున్నారు. సినిమాలు, పాటల ద్వారా గుర్మీత్ ఎంత ప్రాచుర్యం పొందాడంటే... `హైవే లవ్ చార్జర్` పేరుతో గుర్మీత్ విడుదల చేసిన పాటల ఆల్బం విడుదలైన మూడు రోజుల్లోనే 30 లక్షల కాపీలు అమ్ముడు పోయింది.